Header Banner

తారక రామారావు గొప్ప విజయాలు అందుకోవాలి.. చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు!

  Mon May 12, 2025 12:06        Politics

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జాన‌కీరామ్ కుమారుడు నంద‌మూరి తార‌క రామారావు హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఈరోజు పూజ కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తార‌క రామారావుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎన్‌టీఆర్ గొప్ప విజ‌యాలు అందుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. "తార‌క రామారావు ఇండ‌స్ట్రీలో అడుగుపెడుతోన్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ఎన్‌టీఆర్ గొప్ప విజ‌యాలు అందుకోవాల‌ని కోరుకుంటున్నాను" అని సీఎం చంద్ర‌బాబు పోస్ట్ చేశారు. 

 

ఇది కూడా చదవండి: పోలీసు విచారణకు హాజరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే! జగన్ పర్యటన సందర్భంగా..

 

హీరో తార‌క రామారావు మాట్లాడుతూ... "మా ముత్తాత ఎన్‌టీఆర్‌, మా తాత హ‌రికృష్ణ‌, మా నాన్ని జాన‌కీరామ్ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయ‌ని న‌మ్ముతున్నాను. ఈ రోజు నా కుటుంబ‌స‌భ్యులంద‌రూ న‌న్ను ప్రోత్స‌హించ‌డానికి ఇక్క‌డి రావ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలే న‌న్ను ముందుకు న‌డిపిస్తాయ‌ని న‌మ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచి మీడియా ఎంతో స‌హ‌క‌రించింది. వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు" అని అన్నారు. కాగా, మూవీ ప్రారంభ‌త్స‌వ‌ కార్య‌క్ర‌మానికి నారా భువ‌నేశ్వ‌రి, దుగ్గ‌బాటి పురందేశ్వ‌రి, గారపాటి లోకేశ్వ‌రి హాజ‌ర‌య్యారు. నారా భువ‌నేశ్వ‌రి హీరోహీరోయిన్ల‌పై క్లాప్ కొట్టి అభినందించారు. త‌న తండ్రి సీనియ‌ర్ ఎన్‌టీఆర్ న‌ట‌న‌లో ఎంత కీర్తి తెచ్చుకున్నారో తార‌క రామారావు కూడా అలానే ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations